తాజా వార్తలు

 • Development will happen in Hyderabad with BJP
  బిజెపితోనే హైదరాబాదు అభివృద్ధి సాధ్యం...

  హైదరాబాద్ లో బిజేపీని గెలిస్తేనే నగరాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షులు, ఎమ్మేల్యే జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన బిజేపీ మహాసంపర్క్ అభియాన్ లో కిషన్ రెడ్డి వెల్లడించారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిజేపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.  ఆన్ లైన్ లో కొత్తగా సభ్యత్వాలు పొందిన వారిని ప్రత్యక్షంగా కలిసి పార్టీ సిద్ధాంతాలు, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు భారతీయ జనతా పార్టీ మహాసంపర్క్ అభియాన్‌ను రూపొందించింది. మే 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ రోజు బాగ్ లింగంపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

  Read More
 • 3D illuminating mapping inauguration
  త్రీడీ లైటింగ్ ప్రారంభం...

  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాచిగూడ రైల్వే స్టేషన్ కు “త్రీ డీ మ్యాపింగ్ లైటింగ్ సిస్టం’ను ఏర్పాటు చేశారు. దీనిని నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి తదితరులు హాజరై ప్రారంభించారు.

  Read More
 • No Delay should happen in finding Solutions to People’s Problems
  ప్రజాసమస్యల పరిష్కరంలో అలసత్వం వద్దు...

  ప్రజాసమస్యలను పరిష్కారంలో అలసత్వం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అంబర్‌ ఎమ్మెల్యే జి.కిషన్‌ రెడ్డి కోరారు. స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంటనే తగు చర్యలు చేపట్టాలని సూచించారు. కాచిగూడ డివిజన్‌ లో గురువారం ఆయన పలు బస్తీలలో పాదయాత్రం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లోని నింబోలి అడ్డా, చెప్పల బజార్‌, కుద్బీగూడ తదితర ప్రాంతాలలో పాదయాత్ర ద్వారా వివిధ శాఖల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. స్థానికులు మంచినీరు, డ్రైనేజీ, శానీటేషన్‌, విద్యుత్‌, రోడ్లు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ప్రజల చెప్పే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖాల అధికారులతో పాటు కాచిగూడ మాజీ కార్పొరేటర్‌ కన్నేఉమారాణి, బీజేపీ గ్రేటర్‌ కార్యదర్శి కన్నే రమేష్‌ యాదవ్‌,డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  Read More

వీడియోలు

 • BJP Leader Kishan Reddy Exclusive Interview With Sattanna | Muchatta ...
  BJP Leader Kishan Reddy Speaks to Media | Lashkar Bonalu 2017...
  BJP MLA Kishan Reddy Alleges Beef Mafia In Hyderabad ...