img
  • కిషన్ రెడ్డి

  • Join Me On:
  • Facebook

కిషన్ రెడ్డి


గంగాపురం కిషన్ రెడ్డి మే15, 1964 లో జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించాడు.

కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రెండు కోట్ల మంది యువకులు సభ్యులుగా ఉన్న 'భారతీయ జనతా యువ మోర్చా' జాతీయ అధ్యక్షుని స్థాయికి చేరుకోవడం స్ఫూర్తి దాయకం. నమ్మిన సిద్ధాంతాలతో 27 సంవత్సరాలుగా ప్రజా సేవ చేస్తూ ఇప్పటికీ యువ నాయకుడిగా ఉన్న ఘనత కిషన్ రెడ్డిది.

ప్రజల సమస్యలు పరిష్కరించి వారి ఆర్ధిక స్థితి మెరుగుపరిచే నాయకుడిగా కిషన్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల గుండెలో సుస్థిర స్థానాన్ని పొందాడు. స్నేహితులకు ఒక విలువైన ఆశయాలు కలిగిన వ్యక్తిగా కిషన్ రెడ్డి సుపరిచితుడు.

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు కిషన్ రెడ్డి. ఆదర్శాలు చెప్పినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు, మనం ఆచరించి చూపినపుడే మార్పు సాధ్యమవుతుందని త్రికరణశుద్దిగా నమ్మి దానిని పాటించే నాయకుడు కిషన్ రెడ్డి.


స్ఫూర్తి మరియు సమాజ సేవ

దేశ ప్రజలు కీర్తించిన రాజకీయ యోధుడు, నీతి నిజాయితీలు కలిగిన మహానాయకుడు అయిన శ్రీ జయప్రకాష్ నారాయణ విధానాలు కిషన్ రెడ్డిలో స్ఫూర్తి నింపాయి. దేశ ప్రజలను చేతన్య వంతులుగా చేసే విషయాలు ప్రబోధించిన స్వామి వివేకానంద నుండి కిషన్ రెడ్డి ప్రేరణ పొందారు.

జాతీయ సమైక్యతను పెంపొందించే బిజెపి సిద్దాంతాలను అయిన త్రికరణ శుద్దిగా నమ్మడంతో పాటు అమలు కూడా చేస్తారు.

ఆయన తన చిన్న తనం నుంచే సామాజిక, సాంస్కృతిక మరియు జనహిత సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకునేవారు. అణగారిన ప్రజలలో పేదరిక నిర్మూలన గూర్చి చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారు.

ప్రజలను సామాజిక, రాజకీయ, ఆర్ధిక మరియు న్యాయ సమస్యల పై చేతన్యవంతులను చేసే పలు కార్యక్రమాలలో కిషన్ రెడ్డి చురుకుగా పాల్గొనేవారు.

తుఫాను మరియు భూకంప బాధితులకు పునరావాసం ఏర్పరుచుటకు నిర్వహించే కార్యక్రమాలలో కిషన్ రెడ్డి చురుకుగా పాల్గొనేవారు.


విద్యార్ధిగా కిషన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు

ఆయన బడికి వెలుతున్న రోజులలో, స్థానిక సమస్యల నిర్మూలనలో చురుకుగా పాలుపంచుకునేవారు. ఆయన విద్యార్ధి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కనబరిచేవారు.

ఆయన కళాశాల రోజులలో, విద్యార్ధుల బాధ్యతల గూర్చి సహా విద్యార్ధులకు తెలియజేసేవారు, అంతే కాకుండా స్థానిక పరిపాలన మరియు నిర్వాహక సమస్యల పై ఆందోళనలు చేపట్టేవారు.

తీవ్రవాదం అణిచివేయుటలో ప్రభుత్వ నిర్లక్ష్యాల పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో కిషన్ రెడ్డి చొరవ చూపేవారు.

అంధత్వము మరియు అంగవైకల్యంతో బాధపడే వారి సమస్యలను వెలుగులోకి తేవటం కోసం ఆందోళనలు చేపట్టేవారు అంతే కాకుండా వారికి సమాన హక్కులు కలిపించుటలో ముందుండేవారు.

కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మరియు స్ఫూర్తి

కిషన్ రెడ్డి 1977 లో జయప్రకాష్ నారాయణ్ అధ్యక్షులుగా ఉన్న జనతా పార్టీ యువజన విభాగంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

తదుపరి పరిణామాలలో భాగంగా 1980 లో జనతా పార్టీ నుండి ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆనాటి నుండి నేటి వరకు పూర్తి సమయం వెచ్చిస్తూ పార్టీకి, ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్నారు.

సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన కిషన్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి ఎదిగారు.

దేశ ప్రజలు కీర్తించిన రాజకీయ యోధుడు, నీతి నిజాయితీలు కలిగిన మహానాయకుడు అయిన శ్రీ జయప్రకాష్ నారాయణ విధానాలు కిషన్ రెడ్డిలో స్ఫూర్తి నింపాయి.

స్వామి వివేకానంద బోధించిన భారతీయత, క్రమశిక్షణ, యువశక్తి, నైతికత వంటి భోధనలు కిషన్ రెడ్డిలో నాటుకున్నాయి. ఆయన పిలుపునిచ్చిన సంపూర్ణ విప్లవం కిషన్ రెడ్డిని ఆకర్షించింది.