• Facebook

అసెంబ్లీ నియోజకవర్గం

కిషన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ హైదరాబాద్ లోని అంబర్ పెట్ నియోజికవర్గం నుండి భారతీయ జనత పార్టీ తరపున ప్రజల ద్వారా ఎన్నికవబడ్డ అసెంబ్లీ సభ్యులు.

కిషన్ రెడ్డి గారికి 2009 లో జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా వోట్లతో ఆధిక్యం ఇచ్చి అంబర్ పెట్ నియోజకవర్గం తన పైన ఉంచిన నమ్మకాన్ని గుర్తుచేసుకుంటూ , 2004 హిమాయత్ నగర్ నియోజికవర్గం నుండి మొదటి సారి అత్యధికంగా 32 వేల వోట్లతో అసెంబ్లీ కి పంపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసారు.

కిషన్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సామాన్యుల జీవన నాణ్యత పెంచేందుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేసారు. ప్రజల పరిస్థితులను సమస్యలను అర్ధంచేసుకొని అనుకున్న విధంగా ప్రణాళిక పద్దతిలో అభివృద్ధిని కొనసాగిస్తానని మాటిచ్చారు.

తెలంగాణ రాష్ట్రం

కిషన్ రెడ్డి గారు రాష్ట్రం లో గుండె వ్యాధితో భాదపడుతున్న అనేక మంది పసి పిల్లలకు శాస్త్రచికిత్సలు జరిగి వారికి సహాయం అందేల ప్రభుత్వాన్ని ఒప్పించారు. మన రాష్ట్ర ముఖ్య మంత్రి సమస్యకు స్పందించి , వైద్య సదుపాయాలతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు వైద్యం అందజేస్తున్నారు. పిల్లల విద్య మరియు ఆరోగ్య రంగాలలో అభివృద్ధి కోసం నిబద్దతతో పని చేసినందుకు 'య్యునిసేఫ్' వారు ఆయనను 'పిల్లల కోసం పనిచేసే శాసనసభ్యుడు' అనే పేరును ప్రధానం చేసారు.

కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అసెంబ్లీ లో అడుగుపెట్టిన రోజునుండి ప్రజలను భాద పెడుతున్న చాలా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.కిషన్ రెడ్డి గారి ప్రవర్తన నడవ ద్వారా ఈ ఫలితాలను సాధిస్తున్నారు, ఉదాహరణకు పురుగుమందులు మీద పన్ను విధించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం.ఆయన ప్రభుత్వ పద్దతిని వ్యతిరేకిస్తూ పోరాటాన్ని మొదలుపెట్టి క్రమంగా రైతులకు ఆ ఉద్యమం మీద అవగాహన వచ్చేటట్టు చేసి , ప్రభుత్వం పురుగులమందు మీద పన్నును రద్దు చేయించడంలో విజయం సాధించారు.

జాతీయ స్థాయిలో

కిషన్ రెడ్డి గారు కేంద్రంలో యువతకు సంబంధించిన కీలక విధాన సూత్రీకరణలో ముఖ్య పాత్ర పోషించారు.ఉగ్రవాదానికి వ్యతీరేకంగా న్యూ ఢిల్లీ లో ప్రపంచ యువత సమావేశాన్ని నిర్వహించారు.చొరబాటు మరియు సరిహద్దు ప్రాంత ఉగ్రవాదం వ్యతిరేకిస్తు 'సీమ సురక్ష జాగరణ్ యాత్ర' ద్వారా 7500 కిలోమీటర్లు పైగా పర్యటన చేసి , 8 రాష్ట్రాలలోని 47 జిల్లాలలో 45 రోజులకు పైగా 250 సమావేశాలు చేపట్టారు.ఈ యాత్ర తరువాత సరిహద్దు ప్రాంత ఉగ్రవాదం పైన పుస్తకం కూడా రాశారు.

  • 1994 నుండి గౌరవనీయ ప్రధాన మంత్రి గారి అధ్యక్షతలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ జాతీయ యువత కార్యక్రమాల కమిటి సభ్యులుగా పనిచేసారు.
  • ప్రభుత్వం నిర్వహించిన 'వందేమాతరం' కొత్త సహస్రాబ్ది వేడుకల నేషనల్ స్టీరింగ్ కమిటి సభ్యులుగా పనిచేసారు.
  • ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో బి.జె.పి ప్రచార కమిటి సమావేసకర్త గా పనిచేసారు.
  • హైదరాబాద్ నగరం లోని కార్వాన్ నియోజకవర్గం నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగి 71000 వోట్లను కైవసం చేసుకొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో

2003 ఫెబ్రవరి 10- 11 వ తేదీన కిషన్ రెడ్డి గారు ఉగ్రవాదానికి వ్యతీరేకంగా అంతర్జాతీయ యువత సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సదస్సుకు 55 దేశాలకు చెందిన 195 ప్రతినిధులు హాజరైయ్యారు. యునైటెడ్ నేషన్స్ సమావేశానికి ఒక ప్రత్యేక పరిశీలకుడిని నియమించారు.ఉగ్రవాద వ్యతిరేక ప్రపంచ యువత కౌన్సిల్ ఏర్పాటు ద్వారా యువతకు తమ కార్యక్రమాలను వివిధ సంస్థలతో పంచుకోనేందుకు వేదిక లభిస్తుందని , యువతకు రాజీకియ పార్టీలు అండగా ఉంటూ ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ప్రపంచ శాంతి సాధించేందుకు జరిగిన ప్రయత్నాన్ని అందరు గుర్తించారు. వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ టెర్రొరిస్ం సంస్థకు ఇప్పుడు 50 దేశాలలో ప్రాంతీయ కమిటీలు ఉన్నాయి.

భారతీయ జనత యువ మోర్చా (బి.జె.వై.ఎం),2003 4 నుండి 9 ఆగష్టు వరకు జరిగే సదస్సుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆద్వర్యంలో యువత సమైఖ్య ద్వారా అధికారికంగా అందిన ఆహ్వానం మేరకు కిషన్ రెడ్డి గారు వారి బృందంతో చైనా వెళ్లారు. వారి బృందం చైనా లోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో వారు పాటించే విద్యావిధానాన్ని తెలుసికొని ఆ పద్దతులను మన దేశంలో అమలు పరిచేందుకు పరిశీలించారు.బి.జె.వై.ఎం సభ్యుడిగా 2003 , జూలై 26 నుండి ఆగష్టు 1 వరకు జరిగిన యువత కాంగ్రెస్ సదస్సు హాజరైయ్యారు.

  • 2003 ఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ యువత సమావేశం లో కిషన్ రెడ్డి గారిని మొట్ట మొదటి అంతర్జాతీయ అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది.
  • వరల్డ్ యూత్ కౌన్సిల్ ఎగైనెస్ట్ తెర్రరిసం
  • భారతదేశం లోని న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 10-11-2003 న జరిగిన తీవ్రవాదంపై అంతర్జాతీయ యూత్ కాన్ఫరెన్స్ లో ఎన్నికయ్యారు.
  • అమెరికన్ కౌన్సిల్' ఆహ్వానం మీద 'ఐదు యంగ్ పొలిటికల్ లీడర్స్ గ్రూప్' (ACYPL), ఒక సంయుక్త ప్రభుత్వం ఏజెన్సీ, సభ్యునిగా 1994 లో 45 రోజులు అమెరికా సందర్శించారు. అమెరికన్ వ్యవస్థ వివిధ కోణాలను అధ్యయనం చేశారు.
  • 1994 లో USA, వాషింగ్టన్ DC లో జరిగిన వరల్డ్ విజన్ - 2000' సమావేశంలో పాల్గొన్నారు
  • యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, కెనడా మరియు నేపాల్, చైనా, బల్గేరియా, ఇజ్రాయెల్, మలేషియా, ఈజిప్ట్ మరియు నేపాల్ జాతీయ ప్రభుత్వాల ఆహ్వానం మేరకు ఆ దేశాలను సందర్శించారు.